Saturday, 29 June 2019



రామచంద్రపురం లో రాజుగారి "కోట"........
ప్రస్తుతం మనం 'రామచంద్రపురం'గా పిలుచుకునే ఈ ఊరుని, కొన్ని శతాబ్దాల క్రితం 'పెంకుళ్లపాడు' అని పిలిచేవారు. ఇది కాకర్లపూడి రాజుల సంస్థానంలో ఉండేది. ఆ రాజుల కోట 'కోటిపల్లి' లో ఉండేది. 17 వ శతాబ్దంలో గోదావరి నది వరదలలో ఈ కోటిపల్లి కోట దెబ్బతినడంతో, అప్పటి రాజుగారు' శ్రీ కాకర్లపూడి రామచంద్రరాజు' గారు 'పెంకుళ్లపాడు'లో 17 వ శతాబ్దం మధ్యలో, ఈ కోటని నిర్మించడం జరిగింది. అందుకే, ఆయన పేరుమీద ఈ ఊరు పేరుని 'రామచంద్రపురం' గా మార్చారు. అయితే, ఈ ఊరు పేరుతో ఇంకొన్ని ఊర్లు ఉండడంతో, జనం దీనిని, 'కోట రామచంద్రపురం' అని పిలిచేవారు.